* ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహారాష్ట్ర(Maharastra) ఎన్నికల్లో కాంగ్రెస్(Congress)తో పొత్తుకు సై అని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asadudhin owaisi) ప్రకటించారు. ఆ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రధాని మోదీ(Modi)ని ఓడించేందుకు అందరూ కాంగ్రెస్తో కలవాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై ఇప్పటికే కాంగ్రెస్ కు లేఖ రాశామని, ఆ పార్టీ స్పందన కోసం వేచి చూస్తామని చెప్పారు. కాంగ్రెస్ కలిసి రాకుంటే ఒంటరిగానైనా పోటీ చేస్తామని తెలిపారు. బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ (B Team) అనే ఆరోపణలను కొట్టిపారేశారు.
…………………………………