* బావి నీళ్లు తాగి ఇద్దరి మృతి
* మరో 30మందికి పైగా అస్వస్థత
* మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగడంతో బావినీటిపై ఆధారం
ఆకేరు న్యూస్, సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లా(Sangareddy District) నారాయణ్‌ఖేడ్ సంజీవన్‌రావుపేట గ్రామంలో కలుషిత నీళ్లు కలకలం రేపాయి. ప్రతి ఇంట్లో బాధితులు ఉన్నారు. కలుషిత నీళ్లు తాగి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. నారాయణ్‌ఖేడ్ సంజీవన్రావుపేటకు మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో మూడు రోజులుగా అందరూ బావినీటిపై ఆధారపడుతున్నారు. నీటి కలుషితం వల్ల మహేష్(Mahesh), సాయమ్మ(Sayamma) అనే ఇద్దరు మృతి చెందారు. 30మందికి పైగా అస్వస్థత చెందారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు కలుషిత నీటి బాధితులు ఉన్నారని గ్రామస్థలు ఆందోళన చెందుతున్నారు. బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బావి నీటి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు. ట్యాంకర్ల(Tankers) ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో హెల్త్ క్యాంపు(Health Camp) ఏర్పాటు చేశారు.
………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
