
* కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు తుమ్మల లేఖ
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినందున రైతులకు యూరియా
అవసరం అధికంగా ఉంటుందని రాష్ట్రానికి సరిపడేవిధంగా యూరియాను కేటాయించాలని కోరుతూ
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. రాష్టరంలో 1.94 లక్షల యూరియా కొరత ఉందని తుమ్మల ఆ లేఖలో పేర్కొన్నారు. జులై నెలకు నిర్దేశించిన సప్లై ప్లాన్ ప్రకారం తెలంగాణకు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిం ఉందన్నారు. కానీ అందులో అధికమేర ఇంపోర్టెడ్ యూరియాను కేటాయించడం ఆందోళన కలిగిస్తోందని తుమ్మల ఆ లేఖలో పేర్కొన్నారు. ఆర్ఎఫ్ సీఎల్ నుంచి తెలంగాణకు స్వదేశీ యూరియాను 30,800 టన్నుల నుంచి 60 వేల టన్నులకు పెంచాలని మంత్రి తుమ్మల కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
……………………………………………