Kancharla Chandrasekhar Reddy
* అల్లు అర్జున్ మామపై తీవ్ర ఆరోపణలు..
* పోలీసులకు ఫిర్యాదు
Kancharla Chandrasekhar Reddy: ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు హైదరాబాద్లోని నానక్రామ్గూడ భూ వివాదంలో వినిపిస్తోంది. మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి ఆయనకు చెందిన వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారని అక్కడి ప్రతినిధులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
అర్ధరాత్రి హైడ్రామా
మంత్రీ కాస్మోస్ ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారని, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. మెయిన్ గేట్ తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించడంతో పాటు కొన్ని చిన్న నిర్మాణాలను ధ్వంసం చేసినట్లు ప్రాంగణవాసులు చెబుతున్నారు.
టిన్ షీట్లతో ఆక్రమణ యత్నం?
వివాదాస్పదంగా ఉన్న స్థలం చుట్టూ రాత్రికి రాత్రే టిన్ షీట్లు ఏర్పాటు చేశారని మంత్రీ కాస్మోస్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తమ ప్రైవేట్ ప్రాంగణంలోకి చొరబడి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని వారు పేర్కొంటున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై మంత్రీ కాస్మోస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భూమి యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి? చంద్రశేఖర్ రెడ్డికి ఈ స్థలంతో ఉన్న చట్టపరమైన సంబంధం ఏమిటి? అనే అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వైపు నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే భూ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
