Hanamkonda
* చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Hanamkonda: ఆకేరు న్యూస్, హనుమకొండ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
నాయుడు కుండా బిర్యానీ హోటల్ ఎదురుగా ప్రధాన రహదారిపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు ఓ వ్యక్తి ఉరివేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సుబేదారి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడి నుంచి ఆధారాలను సేకరించారు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అతడి జేబులో బస్ టికెట్‌తో పాటు సెల్‌ఫోన్ లభించినట్లు తెలుస్తోంది.
సెల్‌ఫోన్, బస్ టికెట్ ఆధారంగా మృతుడి పూర్తి వివరాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అతడు ఎక్కడి నుంచి హనుమకొండకు వచ్చాడు? ఏ కారణంతో ఇక్కడికి వచ్చాడు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడి పూర్తి వివరాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read :

Please tell us what is wrong. Your report will be sent to the website team.
