Tamil Nadu By Elections
* రేపటితో నామినేషన్ల గడువు..
* బహుముఖ పోటీకి రంగం సిద్ధం
ఆకేరు న్యూస్, తమిళనాడు: తమిళనాడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనుంది. దీంతో మదురాంతకం, ధరాపురం నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6, 2026న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 9న ఫలితాలను ప్రకటించనున్నారు.
టీవీకే అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యేలు
ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కె. మరగతం కుమారవేల్, పి. సత్యబాబా పార్టీకి రాజీనామా చేసి తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో చేరడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో టీవీకే వారిద్దరినీ ఆయా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులుగా బరిలోకి దించింది.
ఏఐఏడీఎంకేకు ఏఎంఎంకే మద్దతు
మదురాంతకం నుంచి కనిత సంపత్‌ను, ధరాపురం నుంచి కె. భానుమతిని ఏఐఏడీఎంకే అభ్యర్థులుగా ప్రకటించింది. టి.టి.వి. దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే.. ఏఐఏడీఎంకే అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది.
స్వతంత్రంగా కమ్యూనిస్టు పార్టీలు
మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక ఫ్రంట్‌గా ఏర్పడి స్వతంత్రంగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. మదురాంతకం నుంచి మాజీ ఎమ్మెల్యే పరంతమెన్ పోటీ చేయనుండగా, ధరాపురం నుంచి న్యాయవాది ఎస్. సుగన్యను అభ్యర్థిగా ప్రకటించారు.
నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత రెండు నియోజకవర్గాల్లో తుది పోటీపై స్పష్టత రానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే, ఏఐఏడీఎంకే మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తున్నప్పటికీ.. ఇతర పార్టీల అభ్యర్థుల బరిలోకి దిగడంతో ఎన్నికలు బహుముఖ పోరుగా మారే అవకాశముంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
