* ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం
* రిజరేషన్లలో కోత పెట్టింది కాంగ్రెస్సే
* రెండు విడతల్లో 100కు పైనా స్థానాల్లో గెలుస్తాం
* కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రెస్మీట్
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : గత రెండు పర్యాయాలు కూడా తమకు సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, కాంగ్రెస్ లా ఎమర్జెన్సీ విధించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. మెజారిటీని ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దుకు ఉపయోగించామని చెప్పారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఈరోజు ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్లపై అబద్దాలు చెబుతోంది. మా 400 సీట్ల లక్ష్యాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది కాంగ్రెస్సే’’ అని హోంమంత్రి అమిత్ షా వివరించారు. కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షులు, సీఎంలు బీజేపీ విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తొలి రెండు విడతల్లో తాము వందకు పైగా స్థానాల్లో గెలుస్తామని, అమేధీలో పోటీకి కాంగ్రెస్ భయపడుతోందని చెప్పారు. అసోం, బెంగాల్, యూపీ, ఎంపీ, చత్తీస్గఢ్ రాష్ట్రాలో పాటు, దక్షిణ భారతదేశంలోనూ మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. బీజేపీ 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందన్నారు. ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాల్లో కాంగ్రెస్ కోత పెట్టిందని విమర్శించారు.
—————————————-