Amit Shah Hyderabad Visit
* నేడు హైదరాబాద్కు కేంద్ర హోంమంత్రి
* టీబీజేపీ నేతలతో కీలక భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా (Amit Shah )నేడు హైదరాబాద్కు రానున్నారు. రాత్రికి నగరానికి చేరుకోనున్న ఆయన రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసే అంశాలపై అమిత్ షా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపైనా ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
