Amitabh Bachchan
Amitabh Bachchan: ఆకేరు న్యూస్, ముంబై: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. తాను నటనకు, సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఆయన చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ రిటైర్మెంట్ వదంతులకు కారణమైంది. దీంతో దీనిపై అమితాబ్ స్వయంగా వివరణ ఇచ్చారు.
నిద్రకు వెళ్తున్నానని అర్థం
తాను రాసిన బ్లాగ్ పోస్ట్‌లో ‘‘ఇప్పటికే చాలా రాత్రి అయ్యింది.. రిటైర్ కావాల్సిన సమయం వచ్చింది’’ అని పేర్కొన్నట్లు అమితాబ్ తెలిపారు. అయితే తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుని, తాను నటన నుంచి రిటైర్ అవుతున్నట్లు వార్తలు ప్రచురించిందని చెప్పారు.
దీనిపై తనదైన శైలిలో స్పందించిన అమితాబ్.. ‘‘జీ నహీ హుజూర్, మై కామ్ సే రిటైర్ నహీ హో రహా హూ.. అంగ్రేజీ మే ఇస్కా మతలబ్ హోతా హై మై అబ్ సోనే జా రహా హూ’’ అంటూ చమత్కరించారు. అంటే తాను పని నుంచి రిటైర్ కావడం లేదని, ఆ సమయంలో నిద్రకు వెళ్తున్నానని అర్థమని స్పష్టం చేశారు.
కేబీసీ 18కు హోస్ట్‌గా
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 2000లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌లో ఈ షో ప్రసారమవుతోంది. దీంతో తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు అమితాబ్ స్వయంగా చెక్ పెట్టినట్లయింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
