KUDA
KUDA: ఆకేరు న్యూస్, హనుమకొండ: కుడా పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.
మంగళవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుడా పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కీలక పనులపై సమీక్ష
వరంగల్ బస్ స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, వేయి స్తంభాల గుడి అభివృద్ధి, ఉనికి చర్ల, హనుమకొండ చౌరస్తా రీ-డెవలప్మెంట్, ఔటర్ రింగ్ రోడ్, ఎన్‌హెచ్ గ్రీనరీ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అభివృద్ధి పనులకు భూసేకరణ అవసరమైన ప్రాంతాల్లో ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. భూసేకరణ కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కుడా పీవో అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
