అమ్మమాట - అంగన్ వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క
* రిటైర్మెంట్ బెనిఫిట్లు ప్రకటించిన టీజీ ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అంగన్వాడీ వ్యవస్థ (Anganwadi system) బలోపేతానికి తెలంగాణ సర్కారు (Telangana Government) చర్యలు తీసుకుంటోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement benefits) కింద టీచర్లకు రూ.2లక్షలు(2 lakhs), హెల్పర్ల (Helpers) కు లక్ష రూపాయలు (1 lakh) ఇచ్చే విధంగా కొత్త జీవో జారీ చేయాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్న వారి విన్నపాన్ని మన్నించింది. టీచర్లకు, సహాయకులకు గుడ్న్యూస్ తెలిపింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు 2లక్షలు,.. సహాయకులకు లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. అమ్మమాట – అంగన్ వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క (Minister Sitakka) ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల అవుతుందని మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్ వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
