రైతు రుణమాఫీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ఆసక్తికర ట్వీట్
* రుణమాఫీపై రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎక్స్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు. నాడు మన్మోహన్సింగ్ (Manmohan Singh) సారథ్యంలో.. నేడు ప్రజాపాలనలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు వైపు నడిపించే బృహత్తర పథకం రైతు రుణమాఫీ అన్నారు. నాడు మన్మోహన్సింగ్ పాలనలో దేశ రైతాంగానికైనా, నేడు ప్రజాపాలనలో రాష్ట్ర రైతాంగానికైనా, ఎంత కష్టమైనా.. ఎంత భారమైనా.. ఏకకాలంలో రుణమాఫీ చేసిన చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ కార్యాచరణలో తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా, మలి అడుగు విధి విధానాల ఖరారు అన్నారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతీ నిర్ణయంలో రైతు కోణం ఉంటుందని, ఇది రైతన్నకు మీ రేవంతన్న ఇస్తున్న మాటని స్పష్టం చేశారు.
——————————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
