* మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దామోదర్ మృతి
* దామోదర్‌తో పాటు మరో 17 మంది ఎన్కౌంటర్లో మృతి
ఆకేరు న్యూస్, వరంగల్ : సీపీఐ మావోయిస్ట్ ( Maoist Party పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్ట్‌లు పెద్ద ఎత్తున మృత్యు వాత పడుతున్నారు.
ఈనెల 16న ఛత్తీస్‌గఢ్ ( Chathish garh ) రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ( Damodar )మృతిచెందారు. ఈమేరకు మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దామోదర్ స్వగ్రామం ములుగు జిల్లా కాల్వపల్లి. దాదాపు మూడు దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీకి కీలక నేతగా ఉన్న దామోదర్ మృతి కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవచ్చు. సంచలనం సృష్టించిన సంఘటనల్లో దామోదర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హోదాలో దామోదర్ పనిచేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ, చత్తీష్ ఘడ్ పోలీస్‌లు దామోదర్ మృతిని ధృవీకరించక పోవడం తో ఎన్ కౌంటర్ మృతుల్లో అసలు దామోదర్ ఉన్నాడా …? లేడా అన్న సందేహాలు వస్తున్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు.
……………………………………….