* పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని.. రాష్ట్రంలో అర్హులుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన చివరి వ్యక్తికి అందే వరకు రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతూనే వుంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్‌కార్డుల లిస్టులలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కులగణన, సోషియో ఎకనామిక్ సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిల్లో ఎవరికైనా కార్డులు రాని పక్షంలో గ్రామ సభలలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చునని దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తామని, ఎవరూ ఇప్పుడు కార్డు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో రేషన్ కార్డులు పొందడానికి అర్హులైన వారికి దరికీ రేషన్ కార్డులు అందజేయలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
