Kamareddy RTC Bus Accident
* ఒకరు మృతి, పలువురికి గాయాలు
ఆకేరు న్యూస్, కామారెడ్డి జిల్లా : హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. జుక్కల్ చౌరస్తా సమీపంలో బస్సు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి బోల్తా పడింది. సమాచారం ప్రకారం.. బస్సు వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా..? లేక బస్సులో సాంకేతిక లోపం ఏమైనా ఉందా..? తేలాల్సి ఉంది. ఈ ఘటనతో జుక్కల్ చౌరస్తా సమీపంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
