* యూఎస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ (Chairman Skill University) గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ను నియమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. అమెరికా (America) పర్యటనలో ఉన్న రేవంత్ ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. కాగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University) లో ఆటోమోటివ్ (Automotive) విభాగాన్ని దత్తత తీసుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ (Mahindra and Mahindra Group Chairman) ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఇప్పటికే అంగీకరించారు. త్వరలోనే తన సంస్థకు చెందిన బృందాన్ని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు పంపుతానన్నారు. మూడు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీలో ఆనంద్ మహీంద్రా మేరకు తెలిపారు.
——————————