ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అర్హులై ఉండి రుణమాఫీ కాని బాధితుల పక్షాన నిలబడేందుకు ప్రతిపక్షం బీఆర్ ఎస్ (BRS) సిద్ధమైంది. మీ పేర పట్టాదార్ పాస్ బుక్ (Pass Book)కలిగి ఉండి, అదే పాస్ బుక్ మీద రుణం పొంది ఉండి, లక్ష కానీ, లక్షన్నర లోపు కానీ.. మాఫీ కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (BRS party office) తెలంగాణ భవన్ (Telangana Bhavan) కు ఆ వివరాలు పంపొచ్చు అని నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) తెలిపారు. ఏ సర్వే నంబర్ మీద రుణం పొందారు.. ఏ గ్రామం, ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు అనే వివరాలతో ఇతర విషయాలను 8374852619 అనే నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాలతో మీ రిమార్క్స్ కూడా రాయండి. రుణమాఫీ ఎందుకు కాలేదు.. అధికారులు ఏమన్నారు..? వంటి డిటెయిల్స్ రాసి పంపించండి అని నిరంజన్ రెడ్డి కోరారు. వారికి న్యాయం జరిగేలా తాము కృషి చేస్తామని చెప్పారు.
———————–