Actress Ananya Nagalla
* అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లీసా’. ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జవహర్ పవార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
* రెండు జోనర్ల కలయిక
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు విభిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవిస్తూ ‘లీసా’ కథను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. కథ నచ్చడంతో ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించేందుకు సుముఖత వ్యక్తం చేయడం సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. సహ నిర్మాతగానూ ఆయన వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
* కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన ప్రాంతాల్లో చిత్రీకరణ
‘లీసా’ను కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో అత్యున్నత నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
అనన్య నాగళ్లతో పాటు అల్లాల రవిరెడ్డి, సుమన్, మూసా అలీ ఖాన్, రత్నాకర్ రెడ్డి, జబర్దస్త్ సత్యశ్రీ, గడ్డం నవీన్, ఆకెళ్ల, రవిరెడ్డి, స్వప్న చౌదరి, గోపీ కార్తికేయ, సుజాత, సుజి, మానస, శ్యామ్, వెన్ని, జాను వర్మ, కనకం వెంకట్, బేబీ ట్వింకిల్, హనుశ్రీ తదితరులు నటించారు.
చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
