Dharmasthala Niyojakavargam Success Meet
* ఊహించిన దానికంటే పెద్ద విజయం
– నిర్మాత మేరుం భాస్కర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సినిమాకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో చిత్ర బృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది.
* ఊహించిన దానికంటే పెద్ద విజయం
నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ.. ‘ధర్మస్థల నియోజకవర్గం’ను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని కేంద్రాల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోందని, తాము ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని ప్రేక్షకులు అందించారని అన్నారు. సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించిన దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోటతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రేక్షకులు మంచి మూవీ చేశారని ప్రశంసిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను రూపొందించినట్లు చెప్పారు. సినిమాలోని పాత్రలను ప్రేక్షకులు తమ జీవితాల్లోని వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో పోల్చుకునేలా ఉంటాయని అన్నారు.
ప్రతి థియేటర్ నుంచి మంచి స్పందన వస్తోందని, సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రేక్షకులు కోరుతున్నారని తెలిపారు. సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పాలని, కుటుంబ సభ్యులతో పాటు పిల్లలను కూడా థియేటర్లకు తీసుకురావాలని కోరారు.
* కామన్ మ్యాన్ కథ
హీరో నటరాజ్ మాట్లాడుతూ.. ‘ధర్మస్థల నియోజకవర్గం’లాంటి మంచి చిత్రంతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ, నిర్మాత భాస్కర్ సినిమాకు ఫిల్లర్స్లా నిలిచారని చెప్పారు. చంద్రబోస్ మంచి సాహిత్యాన్ని అందించగా, మహావీర్ ఏలేందర్ పవర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారని ప్రశంసించారు. ఒక కామన్ మ్యాన్ కోసం, కామన్ మ్యాన్ కథతో రూపొందించిన సినిమా ఇదని నటరాజ్ పేర్కొన్నారు. తనకు హీరోగా అవకాశం ఇచ్చి, ఇలాంటి మంచి పాత్ర చేయగలనని నమ్మిన దర్శకుడు, నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు.
* ప్రేక్షకుల స్పందనపై ఆనందం
నటుడు శివకుమార్ మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని చెబుతున్నారని అన్నారు. థియేటర్లకు వెళ్లి సినిమాను చూడని వారు తప్పకుండా మూవీ చూడాలని కోరారు. ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు వారి స్పందన చూసి ఎంతో ఆనందంగా అనిపిస్తోందన్నారు. సినిమాకు మరింత పెద్ద విజయాన్ని అందించాలని కోరారు.
సక్సెస్ మీట్లో ఇతర చిత్ర బృందం సభ్యులు కూడా పాల్గొని సినిమా విజయంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో సాయికుమార్, సుమన్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు నటించారు. చంద్రబోస్ సాహిత్యం, సునీత గానం, వెంకట హనుమ సినిమాటోగ్రఫీ, నందు మాస్టర్ ఫైట్స్, శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ, అస్లాం డైలాగ్స్, సాయిబాబు తలారి ఎడిటింగ్, మహావీర్ ఏలేందర్ సంగీతం, భార్గవాచారి నౌండ్ల ఆర్ట్ విభాగాలను నిర్వహించారు. బి. వీరబాబు పీఆర్వోగా వ్యవహరించారు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం జై జ్ఞాన ప్రభ తోట.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
