* స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
* 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ కేంద్రాలు
* ఆయా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
ఆకేరు న్యూస్, మచిలీపట్నం : కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఏపీ సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ ల కౌంటింగ్ ఉంటుందని, వాటి కోసం కూడా ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో పోలింగ్ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ ఉండనుండడంతో స్ట్రాంట్ రూమ్‌లను, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. ఈరోజు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మీనా పర్యటించారు. స్ట్రాంగ్ రూమ్‌ను, కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు. ఎటువంటి ఘటనలూ చోటుచేసుకోకుండా ముందస్తుగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వివరించారు.
————————–