Pawan Kalyan Andhra Papers
* పన్నులు ఎగ్గొట్టి.. కాలుష్యం పెంచితే ఊరుకోం..
* నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించం..
* కఠిన చర్యలకు ఆదేశం
ఆకేరు న్యూస్, అమరావతి :
ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు ఎగ్గొడుతూ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రా పేపర్స్ సంస్థ 2016 తర్వాత ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని, ప్రస్తుతం సంస్థపై మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా రాజమండ్రి ప్రాంతంలో కాలుష్య సమస్యకు కూడా సంస్థ కారణమవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆంధ్రా పేపర్స్ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పన్నుల బకాయిల వసూలుతో పాటు కాలుష్యానికి సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
