ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ హవా
* తొలి విజయం నమోదు
* మిగతా చోట్ల లీడింగ్‌లో
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మొత్తంగా తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. కూటమిలో ఉన్న తెలుగుదేశం(TDP) , జనసేన(JanaSena), బీజేపీ(BJP) మూడుకు మూడూ వైసీప మాగు పగలగొడుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ సీట్లోనూ వైసీపీకి(YCP) చుక్కలు చూపెడుతున్నాయి. టీడీపీ, జనసేన సంగతి అటుంచితే.. ఏపీలో అంతగా పట్టులేని బీజేపీని కూడా ఈ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. పోటీ చేసిన 10 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల లీడింగ్ లో ఉంది. ఒక చోట విజయం సాధించింది. అనపర్తి నియోజకవర్గం నుంచి నల్లమిల్లి శేషారెడ్డి గెలుపొందారు. లోక్‌సభ స్థానాల్లోనూ మూడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
—————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
