* రాష్ట్ర ఆర్థికస్థితిపై తప్పుడు ప్రచారం
* ఏపీలో అరాచకపాలన సాగుతోంది
* మాజీ ముఖ్యమంత్రి జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆకేరు న్యూస్, తాడేపల్లి : చంద్రబాబు (Chandrababu) అంటేనే వంచన, గ్లోబల్ ప్రచారం అని, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితి (Economic situation) పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ (Former Chief Minister Jagan) విమర్శించారు. బడ్జెట్ కూడా పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు సర్కార్ ఉందని ధ్వజమెత్తారు. శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూన్ దాకా, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power point presentation) ద్వారా జగన్ (Jagan) వివరించారు. రాష్ట్రం పురోగతి రివర్స్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. చంద్రబాబు అరాచకపాలనపై పోరాటానికి వైఎస్సార్ సిద్ధంగా ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పూర్థిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం బాబు ప్రభుత్వానికి లేదంటే, పాలన ఎంతటి అధ్వాన్నస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని జగన్ తెలిపారు. చంద్రబాబు కంటే తమ హయంలోనే తక్కువ అప్పులు చేశామని, మార్చి వరకు ఏపీ (AP) కి ఉన్న అప్పులు 4 లక్షల 85 వేల కోట్లు అయితే ఒక రిపోర్ట్‌లో 10 లక్షల కోట్లు అని, మరో రిపోర్ట్‌లో 14 లక్షల కోట్లు అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు ఎండగడతామని హెచ్చరించారు.
------------------