* మేం అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నాం
* బడ్జెట్లో విద్య, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చాం
* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని, మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్(Hyderabad) లోని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (Telangana Fire Services and Civil Defense Training Institute) లో ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ (Firemen Passing Out Parade) కు రేవంత్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆకాంక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కొలువుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఉద్యోగాల భర్తీపై ప్రధాన దృష్టి కేంద్రీకరించామన్నారు. బడ్జెట్లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 31 వేల మందికి నియామక పత్రాలిచ్చామని వివరించారు.
—————–