AP Weather Rain Alert
* బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
* వాతావరణంలో మార్పులు..
* వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలని సూచన
ఆకేరు న్యూస్, అమరావతి:
ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 10వ తేదీ ప్రాంతంలో వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావంతో తదుపరి రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రం, లోతట్టు ప్రాంతాలకు వెళ్లే వారు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
