ఓటమి బాటలో ఏపీ మంత్రులు
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ప్రభంజనంలో వైసీపీ మంత్రులు అందరూ ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యత కనబరుస్తున్నారు. నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి గురజాల తెదేపా అభ్యర్థి యరపతినేని 1311 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. తొలుత మంత్రి ఆధిక్యంలో కొనసాగగా.. ఆ తర్వాత టీడీపీ అభ్యర్ధి కిమిడి కళా వెంకట్రావు ఆధిక్యంలో ఉన్నారు. అటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి గుడివాడ అమర్నాద్ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలో ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. ఇక పుంగునూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్, గుంటూరు వెస్ట్‌లో విడదల రజని, ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వెనుకంజలో ఉన్నారు. కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి ఆదిమూలపు సురేష్ వెనుకంజలో ఉన్నారు.
——————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
