తండ్రికి వ్యతిరేకంగా వీడియో రిలీజ్ చేసిన ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి
* నాన్నపై సంచలన కామెంట్లు
* ఆయనకు వ్యతిరేకంగా వీడియో విడుదల
* పవన్‌కల్యాణ్ కు సంపూర్ణ మద్దతు
ఆకేరు న్యూస్, కాకినాడ : ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు నడుస్తున్నాయి. కాపునేత ముద్రగడ పద్మనాభం.. అదే సామాజిక వర్గానికి చెందిన జనసేనాని పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా వైసీపీ తరఫున పనిచేస్తున్నారు. పిఠాపురంలో పవన్ ఓడిస్తానని శపథం చేస్తున్నారు. అయితే తాజాగా అతని కుమార్తె ముద్రగడకు షాక్ ఇచ్చారు. పద్మనాభంపై పైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను కనుక ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మీడియా ముందుకు వచ్చి మరీ చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముద్రగడ పద్మనాభం తీరును, ఆయన విసిరిన చాలెంజ్‌ను ముద్రగడ కుమార్తె క్రాంతి వ్యతిరేకించారు.
* నాన్నా… నిన్ను వాడేసి వదిలేస్తారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారని క్రాంతి చెప్పారు. పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని తన తండ్రి చాలెంజ్ విసరడం తనకు చాలా బాధనిపించిందని అన్నారు. ముద్రగడ ప్రకటన తన సొంత వర్గీయులకు కూడా నచ్చలేదని క్రాంతి చెప్పుకొచ్చారు. తన తండ్రే కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు.. ఎవరైనా సరే వంగా గీత గెలుపు కోసం పనిచేసుకోండి.. పవన్ కళ్యాణ్‌ను, పవన్ అభిమానులను కించపరిచేలా కామెంట్స్ చేయకూడదని క్రాంతి వివరించారు. కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి సీఎం జగన్ ముద్రగడను వాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నికల అయ్యాక ముద్రగడను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా అని క్రాంతి జోస్యం చెప్పారు. అంతేకాదు తాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని, స్వయంగా ప్రచారం చేస్తానని చెప్పారు. దీంతో ముద్రగడ కూతురు క్రాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో వైరల్ గా మారాయి.
——————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
