ap schools schedule 2026-27
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు శుభవార్త
ఆకేరు న్యూస్, డెస్క్: . 2026- 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ సిద్ధం కావడంతో 2026- 27లో విద్యార్థుల సెలవుల జాతర పైన కీలక అప్డేట్ తెలిసింది. 2026- 27 విద్యా సంవత్సరం విద్యార్థులకు మొత్తం 87 రోజుల సెలవు దినాలు ఉంటాయని అకాడమిక్ క్యాలెండర్ లో ఏపీ విద్యాశాఖ పేర్కొంది.
* 2026-27 విద్యా సంవత్సరంలో ఏపీలో స్కూల్స్ సెలవులు ఇలా
2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పని దినాలు మాత్రమే ఉంటాయి.ముఖ్య సెలవుల వివరాలను చూస్తే అక్టోబరు 12 నుంచి 21 వరకు దసరా పండుగకు 10 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. దసరా పండుగకు మైనారిటీ స్కూళ్లకు అక్టోబర్ 15వ తేదీ నుండి సెలవలు ఇవ్వనుంది. సంక్రాంతి పండుగకు జనవరి 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు 7 రోజుల పాటు సెలవులు ఇవ్వనుంది.
* ప్రతీ శనివారం నో బ్యాగ్ డే
సంక్రాంతి పండుగకు మైనారిటీ స్కూళ్లకు జనవరి 13 నుంచి 17 వరకు ఐదు రోజులు సెలవులు ఇవ్వనుంది. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇవ్వనుంది. ఇక ఆప్షనల్ సెలవులు 5 రోజులు, స్థానిక పండుగలు జాతరల కోసం లోకల్ హాలిడేస్ మూడు రోజులు ఇవ్వనుంది. ఇదే సమయంలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా పిల్లలకు పుస్తకాల మోత బరువును తగ్గించడం లక్ష్యంగా నిర్వహించనుంది.
* అడ్మిషన్స్ కోసం స్పెషల్ డ్రైవ్, బ్రిడ్జ్ కోర్సులు
జూన్ నెలలో ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేయాలని నిర్ణయించింది. ఒకటి, రెండు, ఆరు తరగతులకు జూన్ 12వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహించనుంది. ఇదే సమయంలో పరీక్షల షెడ్యూల్ ని కూడా అకాడమిక్ క్యాలెండర్ లో వెల్లడించింది.
* పదవతరగతి పబ్లిక్ పరీక్షల డేట్స్ కూడా
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి 31వ తేదీ మధ్య జరుగుతాయని పేర్కొంది. మొత్తంగా 2026- 2027 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ విద్యార్థుల కోసం, ప్రణాళికబద్ధంగా అకాడమిక్ క్యాలెండర్ ను రూపొందించి దాని ఆధారంగా స్కూల్స్ నిర్వహించనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
