* ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటనతో కరీంనగర్, జనగామ జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ముక్క నివేశ్ (20), జనగామ జిల్లాకు చెందిన పార్శి గౌతమ్ కుమార్ (19) అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. వీకెండ్ కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వాటర్‌ఫాల్స్ చూసేందుకు సరదాగా బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారును ఫినిక్స్ పరిధిలోని మెట్రోటౌన్ సెంటర్ వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నివేశ్, గౌతమ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈఘటనతో ఆయా కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. అమెరికా నుంచి స్వస్థలాలకు భౌతికకాయాలు తరలించేందుకు అధికారులతో చర్చిస్తున్నారు.
—————————————–