BRS Workers Join Congress
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గత రెండున్నర ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జనగామ జిల్లా
చిల్పూర్ మండలం కొండాపూర్ కి చెందిన సుమారు 50 మంది యువకులు (ముదిరాజ్ కులస్తులు, బిఆర్ఎస్ కార్యకర్తలు) మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో ఆదివారం కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనిలోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జక్కుల వీరయ్య, చొక్కం సంపత్, చొక్కం రమేష్, రాజు, నాగరాజు, అజయ్, లింగనబోయిన రమేష్, ఇట్టబోయిన రాజశేఖర్, రాయగిరి సత్యం, పెద్ద వీరయ్య, మోతే రాహుల్, రంజిత్ తో పాటు మరో 30మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని వర్గాల ప్రజలు సుముఖంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అనడానికి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, బొమ్మిశెట్టి బాలరాజు, కొండాపూర్ ఉప సర్పంచ్ నరేష్, ఎడవల్లి మల్లారెడ్డి, ఎల్లయ్య, కిమాని వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
