Lions Club Breakfast Distribution
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రంలోని రోగులకు లయన్స్ క్లబ్ ఆఫ్ శివుని పల్లి ఆదివారం అల్పాహారాన్ని అందించారు. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్
(PDG) వెంకటేశ్వర్ రావు జన్మదినం సందర్భంగా “MEALS ON WHEELS” ప్రేరణతో 10 మందికి అల్పాహారం అందించారు. రెండు రోజుల క్రిందట బాధ్యతలు స్వీకరించిన శివునిపల్లి లైన్స్ క్లబ్ సభ్యులు ఆదివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి రోగులతో పాటు మునిసిపాలిటీ కార్మికులు, అనాధలు, ప్రభుత్వ హాస్పిటల్ లోని రోగులు 20 మందికి అల్పాహారం పండ్లు పంచటం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శివునిపల్లి అధ్యక్షుడు తుమ్మణపల్లి రవికిరణ్, కార్యదర్శి పులి వినయ్ కుమార్, కోశాధికారి కందగట్ల శ్రీకాంత్, కోట రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
