MLA Kadiyam Srihari Pre Primary Teacher Re Exam
* మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎమ్మెల్యేకు వినతి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు, ఆయాల ఎంపిక కోసం మళ్లీ పరీక్ష నిర్వహించాలని మీదికొండ గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతి పత్రం ఇచ్చారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ జోగు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యే వినతి పత్రం అందించిన అనంతరం పరి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు హాల్ టికెట్లు రాలేదని దీనిపై సంబంధిత అధికారులను విచారించి తిరిగి పరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేని కోరారు. దానికి ఎమ్మెల్యే స్పందించి తగు చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
