Thorrur Friendship Day
ఆకేరు న్యూస్, తొర్రూర్ : తొర్రూర్ పట్టణ కేంద్రంలోని యతిరాజరావు పార్క్లో ‘యతిరాజరావు పార్క్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవ (ఫ్రెండ్షిప్ డే) వేడుకలను అత్యంత వేడుకగా, ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తి రవీందర్,మాట్లాడుతూ మానవ సంబంధాలలో ఎటువంటి స్వార్థం లేని ఏకైక పవిత్రమైన బంధం స్నేహం. జీవితంలో ఎంత ఎదిగినా మంచి స్నేహితులు తోడుగా ఉంటే వచ్చే ఆనందం వేరు అని స్నేహం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
అనంతరం ప్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు యం. బుచ్చయ్య (ఎం ఈ ఓ), మాట్లాడుతూ.. “కష్టసుఖాల్లో తోడుగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. రామలక్ష్మణులు, కృష్ణార్జునుల కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు స్నేహానికి ఉన్న విశిష్టత అనన్యమైనది. వయస్సుతో సంబంధం లేకుండా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఒకే కుటుంబంలా కలసిమెలసి ఉండటం అభినందనీయం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ట్రెజరర్ మాదాసు రాములు, సలహాదారులు సోమేశ్వరరావు, చీకటి వెంకన్న, వీరన్న, యాకుబ్ అలీ, ఉపేందర్, రమేష్, శ్రీనివాస్, వెంకట్, మన్మోహన్ చారి, వెంకన్న, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.
సభ్యులు,వాకర్స్ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని, మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
