* సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వస్త్రధారణ
* ఈసారి శారీ మరింత స్పెషల్.. ఎందుకంటే..
ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా 8వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆమె బడ్జెట్లో కేటాయింపులు.. తాయిలాలు.. వడ్డింపులు ఎలాగున్నా.., దేశ సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆమె వస్త్రధారణ ప్రతీసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్కువగా చేనేత చీరలనే ధరించే నిర్మలమ్మ.. బడ్జెట్ సమావేశాల సమయంలో తప్పనిసరిగా చేనేత చీరలోనే కనిపిస్తారు. 2019లో తొలిసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ నాటి నుంచీ, ఏటా బడ్జెట్ వేళ తాను ధరించే చీరలో విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారట. అయితే.. ఈసారి ధరించిన చీరకు మరో ప్రత్యేక ఉంది. ఓ పద్మశీ గ్రహీత స్వయంగా డిజైన్ చేసిన చీర అది. బిహార్లో ఓ సందర్భంలో మంత్రిని కలిసినప్పుడు పద్మశ్రీ దులారీదేవి (Padmasri dularidevi) మంత్రికి కానుకగా ఇచ్చారు. బడ్జెట్ రోజున దాన్ని ధరించాలని ఆమె కోరాట. ఆమె కోరిక మేరకే బంగారు అంచుతో ఉన్న గోధుమ వర్ణం చీరలో ఈరోజు నిర్మలమ్మ ఆకట్టుకున్నారు. మదుబని ఆర్ట్ లో ప్రత్యేక ప్రతిభ చూపుతున్న దులారీదేవిని కేంద్రం 2021లో పద్మశ్రీతో సత్కరించింది.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
