* అంతకు ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలాసీతారామన్
* నిర్మలమ్మకు స్వీటు తినిపించిన ముర్ము
ఆకేరు న్యూస్, డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Union Budget) ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే విపక్షాలు నిరసనలు మొదలుపెట్టాయి. మహాకుంభమేళా(Maha Kumbh Mela) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై చర్చకు పట్టుపట్టాయి. విపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Seetharaman) బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్ లో నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్రపతి ముర్ము(President Murmu)ను కలిశారు. బడ్జెట్ ప్రతిపాదనల రూపురేఖలను ఆర్థిక మంత్రి రాష్ట్రపతితో చర్చించారు. బడ్జెట్ వివరాలను రాష్ట్రపతికి కేంద్ర మంత్రి వివరించారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతించారు. కేంద్రమంత్రికి రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. అనంతరం ఉదయం 11 గంటలకు లోక్ సభలో వరుసగా 8వ బడ్జెట్ ను నిర్మలమ్మ ప్రవేశపెట్టారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
