ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగడానికి అధికరులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఓవైపు పోలింగ్ కొనసాగుతుండగా.., స్వతంత్ర అభ్యర్థిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నార్కట్పల్లి మండలం కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆరోపించారు. డబ్బులు పంచుతున్నారని అడ్డుకోబోయిన అశోక్ పై కాంగ్రెస్ శ్రేణులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు., ఘటనపై నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా… తన ఫిర్యాదు పట్ల పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని.. ఆరోపిస్తూ.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు.
—————————