ఆకేరు న్యూస్, హన్మకొండ : నల్గొండ,వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యం లో పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం పరిశీలించారు..ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ తో పాటు మట్టేవాడ, హనుమకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇస్లామియా కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్బంగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును స్థానిక పోలీస్ అధికారులతో పాటు, పోలీస్ బందోబస్తూ మరియు పోలింగ్ కేంద్రం ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు.
————————