
రాయి దాడిలో ఎడమ కనుబొమ్మకు గాయమైన సీఎం జగన్ ..( ఫైల్ ఫోటో)
* కంటికి గాయం
* పక్కనే ఉన్న ఎమ్మెల్యేకు సైతం గాయం
ఆకేరు న్యూస్ , విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై దాడి జరిగింది. విజయవాడ నగరంలో మేమంతా సిద్దం బస్సు యాత్ర కొనసాగుతోంది. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో ఉన్న పాఠశాల పై నుంచి రాయి దూసుకు వచ్చి జగన్కు తాకింది. దీంతో ఆయను ఎడమ కనుబొమ్మపై గాయమైంది. ఒక్క సారిగా అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. రాయి దాడి జరగడానికి ముందు నుంచే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని తెలిసింది. జగన్ బస్సు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ దాడి జరిగింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యేకు సైతం గాయం అయినట్లుగా తెలిసింది. రాయి వచ్చిన దిశగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రాథమికి చికిత్స అనంతరం మేమంతా సిద్దం యాత్ర జగన్ కొనసాగిస్తున్నారు.
————————————