ఆకేరున్యూస్, భద్రాచలం:
భద్రాచలం రాములోరి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. ఈనెల 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రామాలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది. ఇప్పటికే భక్తుల కోసం ఆన్లైన్లో .. కౌంటర్ల వద్ద కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 17న శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మరోవైపు.. సర్కారు కూడా నవమి వేడుకలపై దృష్టి సారించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
————-
Related Stories
December 13, 2024
December 13, 2024
December 13, 2024