PDS Rice Seized Jangaon
* 16 క్వింటాళ్లు స్వాధీనం
ఆకేరు న్యూస్, జనగామ: అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరుప్పుల మండలం మాల్యా తండాలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. మొత్తం 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది.
మాల్యా తండాకు చెందిన కుక్కట్ల లక్ష్మణ్, భుక్య రామచంద్రు తమ ఇళ్లలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారి ఇళ్లలో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై దేవరుప్పుల ఎస్ఐ సృజన్ కుమార్ వివరాలు వెల్లడించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
