
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ (AZAHARUDDIN) ను నిలిపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.. కాగా బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్,( MEENAKSHI NATARAJAN) పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ( MAHESH KUMAR GOUD ) లు సీఎం రేవంత్ రెడ్డి ( REVANTH REDDY)తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అజహర్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.. గత ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ( MAGANTI GOPINATH)కు 80వేల 549 ఓట్లు రాగా అజహర్ కు 64వేల 212 ఓట్లు వచ్చాయి. అజహర్ పై మాగంటి గోపీనాథ్ 16 వేల 337 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. ఈ నేపధ్యంలో ఉప్ప ఎన్నికలు అధికార పర్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికార పార్టీ భావిస్తోంది.
కీలక అంశాలపై ముగ్గురు నేతల చర్చ
సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్,పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు. 31వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న పాద యాత్ర గురించి ముగ్గురు నేతల మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల( BC RESERVATIONS)పై ఆగస్టు 5 నుంచి 7 వరకు ఢిల్లీలో చేపట్ట నున్న మూడు రోజుల కార్యచరణను రూపొందించారు.ఆగస్టు 5 న పార్లమెంట్ (PARLIAMENT)లో బీసీ రిజర్వేషన్లపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే 6న 6న జంతర్ మంతర్ (JANTHAR MANTHAR)వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకత్వం, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రైలులో ప్రతీ నియోజకవర్గం నుంచి 50 మంది కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీ పర్యటన అనంతరం తెలంగాణలో యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది.
……………………………………………