
ప్రజా శాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్
సాదరంగా ఆహ్వానించిన కేఏపాల్
ఆకేరు న్యూస్ : బీజేపీ నేత, నటుడు బాబూ మోహన్ ( Babu Mohan ) ప్రజా శాంతి పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆంథోలో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.గతంలో మంత్రిగా నాలుగు సార్లు ఎమ్మల్యేగా పనిచేశారు. బాబుమోహన్ ను కేఏ పాల్ ( K A Paul) సాదరంగా ఆహ్వానించారు. ఇటీవలి కాలంలో బాబూమోహన్ బీజేపీ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బాబూమోహన్ పోటీ చేస్తారని పార్టీ చీఫ్ ప్రకటించారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు లేదా కుల పార్టీలు ఏలుతున్నాయని కేఏపాల్ తీవ్రంగా విమర్శించారు.