Bandi Sanjay Son Bandi Bhagirath Surrender POCSO Case
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఎట్టకేలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోలీసులకు లొంగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలికను లైంగికంగా వేదించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్నాడన్న ప్రచారం జరిగింది. మేడ్చల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట భాదితురాలు, ఆమే తల్లి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితుడుగా ఉన్న భగీరథ్ కోసం ప్రత్యేక పోలీసు దళాలు వేట ప్రారంభించాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అదే విదంగా బండి భగీరథ్ కోంసం లుక్ అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఇలాంటి పరిణమాల నేపథ్యంలో భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు.
* నేనే పోలీసులకు అప్పగించాను: బండి సంజయ్
చట్టం , న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. నా బిడ్డ అయినా ఎవరైనా చట్టం ముందు అందరూ సమాన
మే, నా కొడుకు తప్పు చేయలేదంటున్నాడు. ఆధారాల కోసమే అప్పగింతలో ఆలస్యం అయింది.అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే..

Please tell us what is wrong. Your report will be sent to the website team.
