KGBV Student Cash Reward
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో జరిగిన ప్రజా పాలన – ప్రగతి పాలన విద్యా విజయోత్సవ వారోత్సవాలలో కమలాపూర్ కేజీబీవీ కళాశాల విద్యార్థిని సిహెచ్. దివ్యకు ఘన సన్మానం జరిగింది. 2026 ఇంటర్మీడియట్ MPC లో 1000 మార్కులకు గానూ 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు చేతులమీదుగా ఆమెకు రూ. 25,000 ల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.
కమలాపూర్ కేజీబీవీ కళాశాల పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన దివ్య ను స్పెషల్ ఆఫీసర్ కె. అర్చన అభినందించారు. తండ్రి లేకపోయినా, తల్లి కూలి పనులు చేస్తూ ఎన్నో కష్టాల నడుమ ఉన్నప్పటికీ విద్యార్థిని దివ్య చదువు పట్ల చూపిన శ్రద్ధ చూపించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
