* సంజయ్ సభకు అనుమతి రద్దు
* మండిపడుతున్న బీజేపీ శ్రేణులు
* సభా నిర్వహించి తీరుతామంటున్న కాషాయ దళం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎన్నికలు వెడెక్కాయి. ప్రధాన పార్టీల్లో రాజకీయ రగడ మొదలైంది. ఇందుకు కేంద్ర మంత్రి ఈ రోజు సాయంత్రం చేపట్టే సభా కారణమైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ బోరబండలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందుకు గాను పార్టీ నాయకులు పోలీసుల నుండి అనుమతి తీసుకొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో బండి సంజయ్ చేపట్టబోయే సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పార్టీ నాయకులు పోలీసుల తీరును తప్పుబట్టారు. పోలీసులు సభకు అనుమతి నిరాకరించినా.. సభను చేపట్టే తీరుతామని బీజేపీ ప్రకటించింది. సమావేశానికి పార్టీ శ్రేణులు రావాలని కోరింది. దీంతో రాజకీయ వేడి మొదలైంది. బండి సంజయ్ చేపట్టనున్న బోరబండ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
…………………………………………….
