
* అసెంబ్లీ ఆమోదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదం తెలిపింది. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు తమ మద్దతును తెలిపాయి.దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లు పై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని ఎవరు ఔననా్న కాదన్న బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన కొద్ది గంటలకే బీసీ బిల్లును ఆమోదించారు. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిచింది. మంత్రి సీతక్క అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. బీసీ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఆమోదం పొందాయి.
………………………………………..