
* జిల్లా కలెక్టర్ దివాకర
ఆకేరు న్యూస్, ములుగు:జిల్లా లోని వివిధ కూడలిలో జరుగుతున్న సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని బండారుపల్లి కూడలి, గట్టమ్మ, జంగాలపల్లి కూడలీలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులకు వివిధ సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బండారుపల్లి కూడలిలో “I LOVE MULUGU” అనే సుందరీకరణ ను , గట్టమ్మ వద్ద సమ్మక్క సారక్క జాతర మరియు రామప్ప ల ప్రాశస్త్యం తెలియజేయు సుందరీకరణ పనులను, నార్లపూర్ బయ్యక్కపేట కూడలినందు కుంకుమ భరణి అంశాన్ని అలాగే తాడ్వాయి కూడలినందు ఆదివాసీలు బాణం సంధిస్తున్నట్టు ఉండాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించారు. అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.కలెక్టర్ గారి వెంట ఈ ఈ పి ఆర్ అజయ్ కుమార్, డి ఈ ధర్మేందర్, తదితరులు ఉన్నారు.
……………………………………………..