
* పస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుత వర్షాకాల సీజన్ లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని , ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జ్వరంతో వచ్చిన ప్రతి వ్యక్తికి మలేరియా, డెంగ్యూ రక్తపరీక్షలను నిర్వహించి వైద్యాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పసర వైద్యాధికారిణి డాక్టర్ సుహానా ను ఆదేశించారు. ల్యాబ్ లో మలేరియా, డెంగ్యూ ఆర్డిటి పరీక్షలకు సరిపడా టెస్టు పరికరాలు , ల్యాబ్ రియేజెంట్ ఉన్నాయా అడిగి తెలుసుకుని లేనియెడల సమకూర్చుకోవాలని లాబ్ టెక్నీషియన్ కు సూచించారు. అనంతరం మందుల నిల్వల గదిలో వర్షాకాలానికి సరిపడే మందులు అందుబాటులో ఉంచుకోవాలని వాటితో పాటు అత్యవసర మందులైన, పాముకాటు , కుక్క కాటు వ్యాక్సిన్ లను నిల్వ ఉంచుకోవాలని ఫార్మసిస్టుకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పస్ర వైద్యాధికారిణి డాక్టర్ సుహానా, ఫార్మసిస్ట్ శారద, స్టాఫ్ నర్సులు సంధ్య, రమాదేవి, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….