Mahabubabad Country Bomb Dog Death
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: జిల్లా మేచరాజుపల్లి గ్రామంలో నాటు బాంబు పేలడంతో ఒక కుక్క ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని పడమటి చెరువు వద్ద ఉన్న నాటు బాంబును కుక్క కొరకడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కుక్క అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుక్క మృతదేహాన్ని పరిశీలించి, నాటు బాంబు పేలడం వల్లనే కుక్క చనిపోయిందని ధృవీకరించారు. చెరువు పక్కనే అడవి ప్రాంతం ఉండటంతో, జంగి పిలులు, నక్కలు, అడవి పందులను వేటాడేందుకు గుర్తుతెలియని వ్యక్తులు బాంబులు అమర్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, బాంబులు అమర్చిన వారి కోసం గాలిస్తున్నారు. గ్రామాల్లో ఇలాంటి నాటు బాంబులు అమర్చడం వల్ల మూగజీవాలతో పాటు మనుషులకు కూడా ముప్పు పొంచి ఉందని పోలీసులు హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
