* ఇదో మైలు రాయి అన్న చంద్రబాబు
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రాంతమైన ఉత్తరాంధ్రలోని భోగాపురం ఎయిర్ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 96 శాతం వరకు పూర్తయినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అక్రమంలో ఆదివారం అదే ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయింది. న్యూఢిల్లీ నుంచి భోగాపురం చేరుకున్న విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కె అప్పలనాయుడితోపాటు ఉన్నతాధికారులు ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఈ సందర్భంగా వీరికి జిల్లా ఉన్నతాధికారులతోపాటు విమానయాన సంస్థ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. జూన్ 26వ తేదీన ఈ ఎయిర్ పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. విమానం ల్యాండ్ కావడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇదో మైలు రాయి అని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. త్వరలోనే ప్రజల సేవలకు విమానాశ్రయం సిద్ధమవుతోందని చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఎయిర్ పోర్ట్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
……………………………………………………….

